![]() |
![]() |

జబర్దస్త్ లో ఆటో రామ్ ప్రసాద్, హైపర్ ఆది వీళ్ళ జోడితో వచ్చే స్కిట్స్ బాగా పేలుతూ ఉంటాయి. ఇక వీళ్ళు జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఇతరత్రా అన్ని షోస్ లో కనిపిస్తూనే ఉంటారు. ఐతే ఇటు బుల్లి తెర మీద అటు సిల్వర్ స్క్రీన్ మీద కూడా మెరుస్తూ ఉంటారు. ఆది తరచూ మూవీస్ లో కనిపిస్తాడు కానీ ఆటో రాంప్రసాద్ తక్కువ. ఇప్పుడు వీళ్ళు ఫుల్ బిజీగా ఉన్నారు. ఐతే రీసెంట్ గా ఒక వీడియోలో కొన్ని ఇంటరెస్టింగ్ పాయింట్స్ చెప్పారు.
ముందుగా ఆది మాట్లాడుతూ..."ప్రస్తుతానికి నేను మూడు సినిమాలు చేస్తున్నా. రవితేజ గారితో, సందీప్ కిషన్ గారితో, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారితో సినిమాల్లో నటిస్తున్నా. వీళ్ళ మూవీస్ లో ఫన్ రోల్ లో చేస్తున్నా. నెట్ ఫ్లిక్స్ లో ఒక వెబ్ సిరీస్ కూడా చేస్తున్నా. ఈ వెబ్ సిరీస్ మంచి ఫన్ గా ఇంటరెస్టింగ్ గా ఉంటుంది. పెళ్లి తొందరగా చేసుకోవాల్సిన అవసరం ఏముంది... నెమ్మదిగానే చేసుకుంటాలే" అన్నాడు.
ఇక తర్వాత రామ్ ప్రసాద్ మాట్లాడుతూ "నేను జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ చేస్తూనే ఒక వెబ్ సిరీస్ కి కమిట్ అయ్యాను. నాకు రైటర్ గా ఉండడం ఇష్టం. అందుకే మూవీస్ కి ఫ్రీలాన్స్ గా రాస్తూ ఉంటాను. అలాగే త్వరలో డైరెక్టర్ కాబోతున్నా. ట్రైల్స్ లో ఉన్నాను. ఆల్మోస్ట్ ఓకే ఐపోయింది. ఈ ఇయర్ ఒక ఫామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీని డైరెక్ట్ చేయబోతున్నా." అన్నాడు.
ఐతే ఇప్పుడు జబర్దస్త్ నుంచి వెళ్లిన వాళ్లంతా కూడా డైరెక్టర్స్ గా, స్క్రిప్ట్ రైటర్స్ గా , హీరోస్ గా మారిపోతున్నారు. సుధీర్ హీరోగా కొన్ని మూవీస్ చేసాడు, వేణు వండర్స్ డైరెక్టర్ గా బలగం సినిమా తీసి ఎన్నో అవార్డ్స్ సొంతం చేసుకున్నాడు. అలాగే ఇప్పుడు రామ్ ప్రసాద్ కూడా డైరెక్టర్ గా ఒక మూవీ తీయబోతున్నట్లు చెప్పారు. ఆడియన్స్ అంతా కూడా తనకు సపోర్ట్ చేయాలంటూ చెప్పుకొచ్చాడు.
![]() |
![]() |